కృష్ణా జిల్లా: పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెం(డీటీ పాలెం)లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సెబ్, పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. పాడుబడిన ఇళ్ల ల్లోను, స్థలాల్లోను సారా తయారీకి వినియోగించే బెల్లం, బెల్లం ఊట డ్రమ్ము లను ధ్వంసం చేశారు. సుమారు 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని, సారా తయారీకి వినియోగించే గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు, డ్రమ్ములు స్వా. దీనం చేసుకున్నామని మచిలీపట్నం డీఎస్పీ మాసూంబాషా తెలిపారు.