కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ వ్యాప్తంగా, పట్టణంలో రంజాన్ పర్వదినం వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మసీదులు, ఈద్గాల్లో సామూహిక ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. నెల రోజులపాటు ఉపవాసాలు పాటించిన ముస్లీం సోదరులు ఈదుల్ ఫితర్ ప్రార్థనలు అనంతరం ఒకరినొకరు రంజాన్ శుభాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.