అరకులోయలో విద్యుత్ షాక్ తో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న పాత కరెంట్ ఆఫీస్ క్వాట్రార్స్ లో నివాసముంటున్న గోల్లోరి. డోమ్బుదొర (37) భార్య పార్వతి (35 ) భార్య ఇంట్లో ఉన్న బట్టలు ఆరవేస్తుండగా తీగలకు కరెంటు సప్లై ఉండడంతో కరెంటు షాక్ తో కేకలు వేయడంతో భర్త పట్టుకోబోయాడు.
దీనితో కరెంట్ తీగలో ఇద్దరు చిక్కుకుని కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తలు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వీరికి 3 సంవత్సరాల పాప కూడా ఉంది. మృతుడు జిసిసి ఆఫీసు నందు కాంట్రాక్ట్ ఎంప్లాయిగా పని చేస్తున్నాడు. భార్య పార్వతి సాయి కాన్వెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు. దీంతో కరెంట్ ఆఫీస్ క్వార్టర్స్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.