వ్యవసాయశాఖ మంత్రిగా, రైతు బిడ్డగా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కంట తడి పెట్టనివ్వకుండా బాధ్యతలు నిర్వర్తిస్తా అని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు . మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా ఎదుగుదలకు ఆశీస్సులందించిన సర్వేపల్లి ప్రజానీకాన్ని కంఠంలో ప్రాణమున్నంత వరకు రుణపడి ఉంటా. మే 10వ తేదీ తర్వాత ‘సిటిజన్ అవుట్‌రీచ్ కాంపైన్’ పేరుతో అధికారులతో కలసి ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తాం. సంక్షేమ పథకాల అమలు, అవసరమైన పనులపై వాకబు చేస్తాం. ఈ కార్యక్రమం 9 నెలలు జరుగుతుంది అని తెలియచేసారు.