రంజాన్ పండుగ మన అందరి జీవితాలలో వెలుగులను నింపాలని తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంగళవారం ఉదయం రంజాన్ పర్వదినం పురస్కరించుకొని చెంచుపేటలోని ఈద్గా వద్ద నమాజ్ కు హాజరైన వేలాది ముస్లింలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆ అల్లా దయవలన గత రెండేళ్ళ నుండి పడుతున్న కరోనా ఇబ్బందులు తొలగాయని ఇక నుండి మైనార్టీల రాజకీయ, ఆర్థిక, సాంఘిక, అభివృథ్థి దిశగా రాష్ట్ర స్థాయిలో తమ నాయకుడు జగన్మోహనరెడ్డి నియోజక వర్గపరిథిలో సత్యం గారబ్బాయిగా తాను కృషిచెస్తానన్నారు. నమాజు చెయటానికీ మౌళిక వసతుల కల్పించి ఈద్గా కమిటి వారికి థన్యవాదాలు తెలిపారు. ఈద్గ నమాజ్ అనంతరం ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుచూ స్వీట్స్ పంచారు.
రంజాన్ పురస్కరించుకొని కమిటి వారు చల్లని కూలర్లు చల్లని నీటి సదుపాయం తో ఖబరస్తాన్ లో అంతర్గత బాటలు ఏర్పాటు చేయటంతో పలువురు తమ పూర్వీకుల సమాథులను గుర్తించటానికి సమయం తీసికొన్ననూ చక్కటి ఏర్పాట్లు వసతుల కల్పించి నందులకు ఈద్గాకమిటీ వారికీ అభివందనలు తెలిపారు. నమాజ్ అనంతరం తెనాలి ఛైర్మన్ ఖాలేదా నశీం రియాజ్ ఖాన్ దంపతులు రంజాన్ శుభాకాంక్షలు అందచెసి స్వీట్స్ పంచారు.