ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలన్ మస్క్ సంచలన ప్రకటన

international |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 11:09 AM

మనలో చాలా మంది ట్విటర్ వాడుతున్నారు.న్యూస్, సినిమా అప్‌డేట్స్, ప్రముఖుల గురించి సమాచారంతో పాటు అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా మంది ట్విటర్‌ చూస్తారు. ఐతే ఇప్పటి వరకు అందరికీ ఉచితంగానే ట్విటర్ సర్వీసులు లభించేవి.కానీ ఇకపై అలా ఉండదు. ట్విటర్ అందరికీ ఉచితం కాదు. ట్విటర్ ఖాతా కలిగిన వాణిజ్య వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి ఫీజు చెల్లించాల్సిందేనని ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. అది స్వల్ప మొత్తంలో ఉంటుందని పేర్కొన్నారు.సాధారణ వినియోగదారులు మాత్రం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరంలేదు. ఎప్పటిలానే ట్విటర్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ట్విటర్‌ను వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సంస్థలు, ప్రభుత్వాలు మాత్రమే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.


ఇటీవల ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకు, స్పేస్ ఎక్స్ సీఈవో కూడా అయిన ఎలాన్ మస్క్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 44 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.3.30 లక్షల కోట్లు) వెచ్చించి మస్క్ ట్విటర్ దక్కించుకున్నారు.సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్.. ప్రపంచు కుబేరుడు ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత.. అందులో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా ట్విటర్ ను తీర్చిదిద్దుతానని, కొత్త ఫీచర్లను తీసుకొస్తానని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com