పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం అగ్రహారం గ్రామ సమీపాన మంగళవారం రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో సింహాద్రిపురానికి చెందిన చిన్నకోట్ల సుబహాన్ మృతి చెందగా, ధర్మవరానికి చెందిన షేక్ ఖాశీంవలి గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు సుబహాన్ తన బైకుపై సింహాద్రిపురం నుంచి పులివెందులకు వెళ్తుండగా, ఖాశీంవలి పులివెందుల నుంచి కొండాపురం వస్తుండగా అగ్రహారం గ్రామ సమీపాన ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.