వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తోందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. టీడీపీకి రైతుల గురించి మాట్లాడేహక్కు లేదన్నారు. రైతులకు ఏమీ చేయని చంద్రబాబు మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, ఆత్మహత్య చేసుకున్న రైతులను వైయస్ జగన్ ప్రభుత్వం ఆదుకుందన్నారు. రైతులకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తోందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.టీడీపీ పాలనలో 469 మంది రైతులు అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పా ర్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 469 కుటుంబాలకు రూ. 23.45 కోట్లు ఇచ్చింది. ఒక్కోక్క కుటుంబానికి రూ.5లక్షల చొప్పున చెల్లించడం జరిగింది.
క్రాప్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి రబీ–2012–2013లో రూ.119.44 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం బకాయి పెట్టి వెళ్లింది. మా ప్రభుత్వం వచ్చిన తరువాత వైయస్ జగన్ ఈ బకాయిలు చెల్లించారు. రబీ 2018–2019కి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ రూ.596.37 కోట్లు బకాయిలు పెట్టి Ðð ళ్తే మా ప్రభుత్వం వచ్చిన తరువాత వైయస్ జగన్ రూ.596.37 కోట్లు రైతులకు చెల్లించారు. దాదాపుగా 6,18,646 రైతు కుటుంబాలకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.715.31 కోట్లు వైయస్ జగన్ విడుదల చేశారు.రైతు రథానికి సంబంధించి రూ.124.65 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం బాకీ పెడితే మా ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.82.64 కోట్లు ఇప్పటి వరకు వైయస్ జగన్ చెల్లించారు.