గుత్తి మండలం పరిధిలోని అబ్బేదొడ్డి గ్రామంలో ఇమామ్ వలి (34) అనే వ్యక్తి క్రిమి సంహరక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. అబ్బెదొడ్డి గ్రామానికి చెందిన ఇమామ్ వలి కుటుంబ సమస్యలతో పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స నిమిత్తం స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.