జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమాలు తలుచుకుంటే ప్రజలు భయాందోళనలో ఉన్నారు అంటే నమ్మక తప్పదు. రోజు ఏదో ఒక భయంకర సంఘటన చోటు చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన విద్యార్థినిపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఘటనపై జనసేన వీర మహిళ విభాగం నిరసన కార్యక్రమం చేపట్టింది. బాధిత కుటుంబాన్ని ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటాన్ని తప్పుబట్టారు.