తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటాల పంపిణీపై స్పష్టత కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. సమావేశంలో 16 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ ఏడాదికి కృష్ణా జలాల నిష్పత్తి 66:34గా ఉంటుందని స్పష్టం చేశారు.శైలం నుంచి తాగునీటి సమస్య కూడా ఉందన్నారు. విద్యుత్ ఉత్పత్తిపై ఆరుగురు సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.ప్రతిపాదిత 66:34 నీటి పంపిణీకి తాము అంగీకరించబోమని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ఈసారి 50:50 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa