తిరుపతి నగరంలోని ఓ డిగ్రీ కళాశాల నందు డిగ్రీ చదువుతున్న అనంతపురం జిల్లా పామిడి మండలం కొట్టాల గ్రామానికి చెందిన విద్యార్థిని మృతికి కారణమైన చంద్రగిరి ఎస్ఐ ను పూర్తిగా సర్వీస్ నుండి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ శ్రావణి మాట్లాడుతూ ఎస్ఐ విజయ్ కుమార్ తిరుపతి లో చదువుతున్న తన గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకొని మరణించిందని రక్ష్యించాల్సిన వ్యవస్థలో ఉండి ఇటువంటి చర్యలకు ఉపక్రమించడం మొత్తం వ్యవస్థకే అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సదురు ఎస్సై మోసం చేసాడని తొమ్మిది నెలల క్రితం దిశ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యువతితో సర్దుబాటు చేసుకొని వివాహం చేసుకున్నాడని ఆ బాధను తట్టుకోలేక గత మూడు నెలలుగా కళాశాల మానేసి ఇంట్లోని ఉంటూ చివరకు బాధను భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుందని తెలిపారు.
అంతే కాకుండా ఇదే ఎస్సై విధులలో చేరకముందే గుంతకల్లు పోలీస్ స్టేషన్లో ఒక మహిళా పోలీస్ విషయంలో కూడా ఇటువంటి ఆరోపణలే ఉన్నాయని అటువంటి వ్యక్తి ని కేవలం సస్పెన్షన్ సరికాదని పూర్తి స్థాయిలో అతనిని సర్వీస్ నుండి డిస్మిస్ చేసి కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో రక్ష్యణ వ్యవస్థ పై ప్రజలులో అపనమ్మకం ఏర్పడుతుందనే విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రవి, ఉరుకుందు, హేమంత్, శివ, శ్రావణ్, హరిత, హరిక్రిష్ణ, మాధురి తదితరులు పాల్గొన్నారు.