ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బెయిర్ స్టో బౌండరీ కొట్టాడు. మొదటి ఓవర్‌లో మొత్తంగా చూస్తే పది పరుగులు వచ్చాయి. రాజస్తాన్ బౌలర్ బౌల్ట్ మూడో ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా బ్యాటర్లను కట్టడి చేశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మెయిడిన్ ఓవర్ అయ్యింది. మూడో ఓవర్ ముగిసే సరికి పంజాబ్ స్కోరు 17-0 గా ఉంది.
శిఖర్ ధావన్ రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. అశ్విన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి గబ్బర్ అవుట్ అయ్యాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుతిరిగాడు. భనుక రాజపక్స క్రీజులోకి వచ్చాడు. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత పంజాబ్ రెండో వికెట్ ను కూడా కోల్పోయింది. యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో భనుక రాజపక్స బౌల్డ్ అయ్యాడు. అతను 27 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు.