చైనా లో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా జీరో కోవిడ్ పాలసీ ముందుకు తీసుకెళ్లాలన్నారు. వూహాన్లో కరోనాపై విజయం సాధించామో.. అలాగే షాంగైలోనూ విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ పాలసీని వ్యతిరేకించే వారిని కఠినంగా శిక్షించాలని, సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారానికి అడ్డుకట్టవేయాలని జిన్పింగ్ ఆదేశించారు.