రాజస్థాన్ అజ్మీర్‌లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడటంతో స్థానికులను షాక్‌కు గురిచేసింది. పాలిథీన్ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. అయితే నకిలీవా, ఒరిజినలా తెలియాల్సి ఉంది. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు.