ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది ప్రస్తుతం కార్ నికోబార్‌కు పశ్చిమాన 170 కి.మీ దూరంలో ఉంది. వాయుగుండం రేపు తుపానుగా మారే అవకాశం ఉందన్నారు.
తుపానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, రాష్ట్రవ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 10వ తేదీ నాటికి అది దిశను మార్చి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది అని ఐఎండీ తెలిపింది.