నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ రైతులు ఆందోళనకు దిగారు. రైతులు 15 రోజులుగా మార్కెట్ యార్డులో బస్తాలు ఉంచి పడికాపులు కాస్తున్నారు.పచ్చశనగలో దుమ్ము ధూళి ఉందంటూ శనగ రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆరుబయట శనగ బస్తాలు ఆరబెట్టి ఉండడంతో వర్షం వస్తే తడిసి పనికిరావని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. జిల్లాలోని వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పుకోమని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అంటూ రైతులు ఆరోపిస్తున్నారు.