నీట్ పీజీ ప్రవేశ పరీక్ష-2022ను వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 'ఇదంతా తప్పుడు ప్రచారం. షెడ్యూల్ ప్రకారమే మే 21వ తేదీన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు తప్పుడు ప్రచారం నమ్మవద్దు' అని ప్రకటించింది. కాగా ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కొద్దిరోజులుగా విద్యార్థులు అభ్యర్థిస్తుండగా.. కొందరు విద్యార్థులు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీకి లేఖలు రాశారు.