రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇప్పిస్తామంటూ కొందరు ఆఫర్ చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. సీఎం పదవి ఏమైనా పేమెంట్ సీటా? అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని, లేదంటే బొమ్మై సీఎం కావడానికి రూ.కోట్లు చెల్లించినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో బీజేపీ సీఎంలు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.