పంజాబ్‌లోని కపుర్తలా మోడ్రన్ జైలులో నిమ్మకాయల కుంభకోణం జరిగింది. ఈ ఘటనలో ఆ జైలు జైలర్‌పై అధికారులు వేటు వేశారు. జైలు రికార్డుల్లో 50 కిలోల నిమ్మకాయలు కొన్నట్లు ఉన్నా ఖైదీలు మాత్రం తమకు నిమ్మకాయలు అందడం లేదని ఆరోపించారు. దీనిపై జైళ్ల శాఖ మంత్రి హర్జోత్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించడంతో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో జైలర్ గుర్నామ్ లాల్‌ను సస్పెండ్ చేశారు.