ఎల్‌పీజీ సిలిండర్ల ధరల పెంపుపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ యూరప్ టూర్‌ను ప్రస్తావిస్తూ మూడు దేశాల్లో 65గంటలు.. 60 ఫోటో షూట్‌లతో హడావుడి చేసిన మోదీ సాబ్ ఎల్‌పీజీ ధరల బహుమతితో దేశానికి తిరిగివచ్చారని ఎద్దేవా చేశారు. ధరల పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం మోపుతోందని ఖేరా దుయ్యబట్టారు.