ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చి మిర్చి వల్ల ఎన్నో ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 12:17 PM

పచ్చిమిర్చి వంటల్లో ఎక్కువగా వాడతారు. అయితే పచ్చిమిర్చి తింటే అలర్స్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ అని అంటుంటారు. డయబెటిక్ రోగులు కూడా వీటికి దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తుంటారు. అయితే పచ్చి మిర్చి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చిమిర్చిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని రోజూవారీ ఆహారంలో తీసుకుంటే జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిర్చి తినడం వల్ల ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. పచ్చిమిర్చి కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు కూడా చెక్ పెడుతుంది. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఆహరపు రుచిని పెంచుతుంది. కానీ మెదడులోని ఒక భాగమైన హైపోథాలమస్‌ ను ప్రభావితం చేసిన వెంటనే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. భారతదేశంలోని అత్యంత హాటెస్ట్ ప్రదేశాలలో కూడా పచ్చిమిరపకాయలు సమృద్ధిగా తినడానికి కారణం ఇదే. వీటిలోని క్యాప్సైసిన్ రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచుతుంది. దీనివల్ల జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. అల్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు మసాలా ఆహారాన్ని తినడం కష్టం అయినప్పటికీ, పచ్చి మిరపకాయలు తీసుకోవడం వల్ల బొబ్బలు త్వరగా నయమవుతాయి. పచ్చిమిర్చిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల పచ్చిమిర్చి కళ్ళు, చర్మానికి చాలా మేలు చేస్తుంది. పచ్చిమిర్చిని చల్లగా, చీకటి ప్రదేశాలలో ఉంచాలి. గాలి, కాంతికి గురికావడం వలన దాని విటమిన్‌ను నాశనం చేస్తుంది. పచ్చిమిర్చి రక్తంలో షుగర్ లెవల్స్‏ను కంట్రోల్‏లో ఉంచుతాయి. డయాబెటిక్ రోగులు పచ్చిమిర్చిని తినడం మంచిదే. వీటి ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. పచ్చిమిర్చిని తినడం వలన బోలు ఎముకల వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com