మళ్లీ ఖలిస్థాన్ డిమాండ్ పురుడుపోసుకొంటోందా అంటే ప్రస్తుత పరిణామాలు దానికే సంకేతంగా కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఖలిస్థాన్ జెండాలు కనపడడం కలలకం రేపింది. గత అర్ధరాత్రి దాటాక దుండగులు వీటిని అక్కడ పెట్టినట్లు తెలుస్తోంది. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటుకి, అలాగే, గోడలపై దుండగులు ఆ జెండాలను ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. ఈ రోజు ఉదయం వాటిని గుర్తించిన అనంతరం పోలీసులు వాటిని తొలగించారు. విధాన సభ గేటుకు ఉన్న ఖలిస్థాన్ జెండాలను తొలగించామని పోలీసులు మీడియాకు తెలిపారు. పంజాబ్ నుంచి వచ్చిన వేర్పాటు వాదులు ఈ దుస్సాహసానికి వడిగట్టి ఉంటారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామ చేస్తున్నారు.