దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 10 మంది చనిపోగా, 3,044 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,637 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 190.50 కోట్ల కొవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.