క్రికెట్ ఆటలో భాగంగా అపుడప్పుడు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతుంటాయి. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు కిరియన్ పోలార్డ్ బౌలింగ్ అంపైర్ ను కంగారు పెట్టించింది. కోల్ కతా నైట్ రైడర్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సందర్భం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ ను పోలార్డ్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా పోలార్డ్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని సంధించగా.. అది చేతి నుంచి జారిపోయి వెనుకనున్న అంపైర్ ను తాకింది.
దీంతో అంపైర్ వెంటనే పక్కకు జరగడం వీడియోలో కనిపించింది. అనంతరం సారీ అంటూ అంపైర్ కు పోలార్డ్ క్షమాపణలు చెప్పాడు. చేతి నుంచి జారి రావడంతో అంపైర్ కు గాయం కాలేదు. పోలార్డ్ సారీ చెబుతుంటే.. అంపైర్ నవ్వడం చూసే వారికి కూడా నవ్వు తెప్పించింది. ఆటలో భాగంగా అప్పుడప్పుడు ఈ తరహా సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. నిన్నటి మ్యాచులో ముంబై ఇండియన్స్ పై కేకేఆర్ ఘన విజయం సాధించడం తెలిసిందే.