కరోనా వైరస్ ఎపుడు ఏ రూపం తీసుకొంటోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎపుడు ఎలా పుంజుకొంటోందో కూడా చెప్పలేని పరిస్థితి. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 3 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు నిన్న కాస్తంత తగ్గాయి. 3 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.84 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 2,288 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 10 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 3,044 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేల దిగువకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో 19,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.47 శాతంగా, క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 190.50 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.