నెల రోజులుగా టమోటా ధరలు పెరుగుతున్నాయి. దీంతో టమోటా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం, వి.కోట, రామకుప్పం, ఏడోమైలు మార్కెట్లలో సోమవారం 15 కిలోల బాక్సు ధర నాణ్యతను బట్టి రూ.500 నుంచి రూ.820 వరకు పలికింది. నెల రోజుల కిందట బాక్సు ధర రూ.70 నుంచి రూ.90 మాత్రమే పలికింది. ఎండలు ఎక్కువ కావడంతో దిగుబడి తగ్గి టమోటాకు గిరాకీ పెరిగింది. ఏపీలో పాటు, తమిళనాడుకు చెందిన వ్యాపారులు చిత్తూరు జిల్లాలోని మార్కెట్లకు తరలి వస్తున్నారు. రీటైల్ మార్కెట్‌లోనూ టమోటా ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో రూ.65 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. బీన్స్ కూడా 10 కిలోలు రూ.350 నుంచి రూ.420 వరకు పలుకుతోంది. ఉర్లగడ్డలు, క్యాబేజీ కూడా మంచి ధర పలుకుతున్నాయి.