ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటివరకు అర్హత సాధించిన వారికి జూన్ నెలాఖరుకల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. మండలాలు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎస్.షాన్ మోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.