ఓ బామ్మ 98 ఏళ్ల వయసులో వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మునిరత్నమ్మ 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్‌మెట్ లో 17 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నారు. అప్పటి నుంచి ఆ భూమిలో కూలీల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వరి, జొన్న, రాగులు, మామిడి, జామ వంటి పంటలు పండిస్తున్నారు.
ఏ పని చేయడానికైనా వయసు అడ్డు కాదని, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని మునిరత్నమ్మ నిరూపిస్తున్నారు. మునిరత్నమ్మ కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2014లో అప్పటి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మునిరత్నమ్మను శ్రమధాత్రి అవార్డుతో సత్కరించారు.