భూ తగాదాలతో దంపతులు హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లి లో చోటుచేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన దంపతులు కొత్త సాంబయ్య, లక్ష్మి లను అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ డీసిపీలు సంఘటనా చేరుకున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో దంపతుల హత్య సంచలనం సృష్టించింది.