పెడన పట్టణంలో ప్రధాన రహదారి మున్సి పల్ అఫీస్ ఎదురుగా డివైడర్ మధ్యలో వున్న కరెంట్ పోల్ పెనుగాలికి రోడ్డుపై విరిగి పడిపోయింది. ఇటు వంటి శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విద్యుత్ స్తంభం కూలిపోయిన సమయంలో అక్కడ జన సంచారం అధికంగా వుంది. అదృష్టం కొద్దీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. విషయం తెలుసుకున్న పోలీసు వారు హుటా హుటిన సంఘటన స్థలానికి వచ్చి అటుగా వాహనాలు రాకుండా, పెను ప్రమాదం నుండి కాపాడారు.
డివైడర్ ల వద్ద ఉన్న ఇటువంటి కరెంటు స్తంభాలకు రాజకీయ పార్టీలకు సంబం ధించి బ్యాన ర్స్ కటౌట్లు కట్టడం వల్ల అటు వాహన దారులకు ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బం దులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ బ్యానర్‌ను తొలగించాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పురపాలక సంఘ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.