పార్వతీపురం మన్యం జిల్లా విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్లే సమత సూపర్ ఫాస్ట్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సీతానగరం గుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో భోగి నుంచి ఇంజన్ విడిపోయింది. సుమారు 150 మీటర్లకు పైగా ఇంజన్ భోగీలను విడిచి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. లోకోపైలెట్ అప్రమత్తతతో తిరిగి ఇంజన్ భోగీల వద్దకు చేరుకుంది. అనంతరం భోగీలతో బయలుదేరింది.