ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలహీన పడిన అసని తుఫాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 03:28 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని' తుపాన్ తీవ్ర తుపాన్ నుండి తుఫాన్ గా బలహీన పడింది. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం మేరకు మచిలీపట్నంకు 50 కిలో మీటర్లు, కాకినాడకు 180 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. దీంతో మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద కొంత పరిస్థితులు నెలకొన్నాయి. అలలు ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే బీచ్ లోకి పర్యాటకుల అనుమతిని నిలిపి వేశారు. కొంత మేర బీచ్ ముందుకు వచ్చింది. ఈదురు గాలులు వీచటంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. చాకిరేవుపాలెంలో ఎన్నో యేళ్ల చరిత్ర కలిగిన మహావృక్షం నేలకొరిగింది. పలు చోట్ల విద్యుత్ స్థంభాలు పడిపోవటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa