కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు మండలం పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలో బుధవారం తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లు పట్టుకున్నట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. వాహనాల తనిఖీలో భాగంగా కర్నూలు పట్టణానికి చెందిన హరి సాయి అనే వ్యక్తి వద్ద నుంచి 40 తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టుకున్నట్టు తెలిపారు. అతడి వద్ద నుంచి మద్యం, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa