వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి. 1,08,755 కుటుంబాలకు లబ్ధి కల్పిస్తూ రూ.109 కోట్లు జమ. 23,458 మంది ఓఎన్జీసీ బాధిత కుటుంబాలకు రూ.108 కోట్లు. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన ...1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు. మరో రూ.108 కోట్లు జమ చేయనున్నారు. (గతంలో 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.70.04 కోట్ల పరిహారం అందించారు) వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ...గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలుగుతోంది. టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే.