వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా వైఎస్సార్ మత్స్యకార భరోసా. వరుసగా నాల్గవ ఏడాది మత్స్యకార భరోసా పథకం కింద 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.109 కోట్లు ఆర్థికసాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నేడు ముఖ్యమంత్రి YS జగన్ జమ చేయనున్నారు. అంతే కాక ఓఎన్జీసీ పైపులైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.