ఓ ఎస్ఐ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఏపీలోని కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం సీఎం జగన్ బందోబస్తు డ్యూటీకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. అకస్మాత్తుగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం సర్పవరంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం జగన్ శుక్రవారం పర్యటించనున్నారు. ఆ బందోబస్తులో భాగమైన ఈయన ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసుకు సంబంధించి అధికారుల వాదన మరోలా ఉంది. గన్ మిస్ ఫైర్ అవడం వల్ల ప్రమాదవశాత్తూ ఆయన మృతి చెందాడని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విజయవాడలోని నవాబుపేట ఈయన స్వస్థలం. ఎస్ఐకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.