బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు కూడా కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కష్టాలు తీరిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గురువారం సచివాలయం వద్ద మీడియాతో పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ వద్దకు వస్తున్న నాయకులకు ప్రజలు నీరాజనం పడుతున్నారని చెప్పారు.