ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజానీకం నిండు మనసుతో ఆశీర్వదిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 01:21 PM

ప్రతి ఇంటా స్వాగతం.. ఆత్మీయ ఆదరణ.. ఆప్యాయతతో కూడిన పలకరింపులతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రెండో రోజైన గురువారం వేడుకగా కొనసాగిందని మంత్రి విడదల రజని తెలియచేసారు.  స్థానిక ప్రజా ప్రతినిధుల రాకతో ఊరూరా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా సంతృప్త స్థాయిలో తమ గడప వద్దకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజానీకం నిండు మనసుతో ఆశీర్వదిస్తోంది. పింఛన్ల నుంచి ఫీజుల దాకా.. ఇళ్ల పట్టాల నుంచి అమ్మ ఒడి వరకు మూడేళ్లలోనే 95% హామీలను నెరవేర్చి ప్రజల చెంతకు చేరుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. సచివాలయాల సిబ్బందితో కలసి వలంటీర్లు పర్యటనల్లో పాల్గొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com