రాజస్థాన్ లో దారుణ ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై తాత అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక తన తల్లితో పాటుగా తన తాత వద్దే ఉంటోంది. 12 ఏళ్ల క్రితం ఆమె తండ్రి మరణించడంతో అప్పటి నుంచి ఆమె తన తాత వద్దే ఉంటోంది. తల్లి మానసిక వికలాంగురాలు కావడంతో తాత తన స్నేహితులతో కలసి పలుమార్లు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నెలల తరబడి బాలికపై అఘాయిత్యం చేశారు. అయతే బాలిక ఈ మధ్యనే తన పాఠశాలలో అస్వస్థతకు గురైంది. బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె 5 నెలల గర్భవతి అని తేలింది.
దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. తాత స్నేహితుడు రాంలాల్ భీల్ (50), అజయ్ బైర్వా (20), గత కొన్ని నెలలుగా బాలికను బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు బాలిక ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు నిందితులను అరెస్టు చేశారు. బాలికపై జరిగిన దారుణాన్ని చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.