రూపాయి విలువలో మార్పు రావడంతో త్వరలోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం నుంచి ఇవి 3 నుంచి 5 శాతం పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. విడిభాగాలు ఖరీదైనవిగా మారడం వల్ల, యుఎస్ డాలర్ తో రూపాయి విలువ తగ్గిపోవడం వల్ల ఈ పరికరాల ధరలు పెరగనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల సామాన్యులకు మరో షాక్ తగలనుంది.