కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని గోధుమల ఎగుమతుల పై నిషేధం విధించింది. దేశంలో పెరుగుతున్న గోధుమల ధరలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రభుత్వాలతో లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారం మే 13 నాటికి చేసుకున్న ఒప్పందాల మేరకు దిగుమతలు కొనసాగుతాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా భారత్ నుంచి గోధుమల ఎగుమతి విపరీతంగా పెరిగింది. ఫలితంగా భారత్ లో గోధుమల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తో పిండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.