నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)- 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ మే 15 ఆదివారంతో గడువు ముగియనుంది. ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inని సందర్శించవచ్చు. వైద్య విద్య కోర్సులకు సంబంధించి నీట్ యూజీ పరీక్షను జూలై 17, 2022న 13 భాషల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకు రూ.1,600, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ కేటగిరీల విద్యార్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.900గా నిర్ణయించారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నీట్ యూజీ అధికారిక వెబ్‌సైట్, neet.nta.nic.inను సందర్శించాలి. హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. వివరాలను నమోదు చేసి, లాగిన్ పొందాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారాన్ని నింపాలి. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరికి దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దరఖాస్తు ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి. ఇక ఈ నీట్ యూజీ పరీక్షను ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీలు, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, వెటర్నరీ కోర్సులు వంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, దాని అనుబంధ కోర్సులలో ప్రవేశాలకు ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహిస్తారు