దేశంలో రోజు వారీ కరోనా కేసులు 3 వేలకు దగ్గరగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మొత్తంగా కరోనా కేసులు 2841 నమోదు కాగా, ఆదివారం 2,487 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్వల్ప తగ్గుదల నమోదైంది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,21,599కు చేరింది. ఇందులో 4,25,76,815 మంది మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. 5,24,214 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,692 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో 13 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 2878 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. రోజువారీ కరోనా కేసులు తగ్గుతుండడంతో పాజిటివిటీ రేటు 0.59 శాతానికి పడిపోయింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ నుంచి 673 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కేరళలో 523 కరోనా కేసులు, హర్యానాలో 343, మహారాష్ట్రలో 248, యూపీలో 158, కర్ణాటకలో 103 చొప్పున రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి.