తమ ఆదేశాలను పాటించడం లేదని ఇటీవల కాలంలో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు కన్నెర్ర చేస్తోంది. జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని జైలు శిక్షలు విధిస్తోంది. కొన్ని రోజుల క్రితం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు తాజాగా మరో ఐఏఎస్ అధికారికి షాక్ ఇచ్చింది. జీవీఎంసీ కమిషనర్‌గా గతంలో పని చేసిన కాలంలో తమ ఆదేశాలను పాటించలేదని హరినారాయణన్ అనే ఐఏఎస్ అధికారిపై హైకోర్టు 3 నెలల జైలు శిక్షను విధించింది.
విశాఖ నగరంలో వీధి వ్యాపారుల కోసం జారీ చేసిన ఉత్తర్వులను జీవీఎంసీ కమిషనర్ హోదాలో అమలు చేయలేదని ఆగ్రహించింది. విస్తృత ధర్మాసనంలో తమ తీర్పును సవాల్ చేసుకునేందుకు 6 వారాల పాటు ఈ శిక్షను వాయిదా వేసింది. విస్తృత ధర్మాసనం ఈ కేసులో స్టే ఇవ్వకపోతే ఐఏఎస్ అధికారి హరినారాయణన్‌కు చిక్కులు తప్పవు. జూన్ 16వ తేదీన ఆయన స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.