కూరగాయాల్లో ప్రధానమైంది టమోటా. ప్రతి కూరలో దీన్ని వాడాల్సిందే. గత నెలంతా కిలో రూ. 10 నుంచి రూ. 20 లభించిన వరకు టమోటా. ప్రస్తుతం ఆకాశానికి ఎగబాకుతోంది. పెరిగిన ధరల మహిమో, ఉత్పత్తిలేకనో మార్కెట్లోనూ పెద్దగా కనిపించడం లేదు. కొన్ని రోజుల నుంచి ధరలు పెరుగుతుండటంతో దిగుమతులు సైతం తగ్గిపోయాయి. ఈనెల 10 నుంచి 13 వరకు కిలో రూ. 60 పలుకగా. ఆదివారం ఏకంగా రూ. 80కు చేరింది.