తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ పార్టీ ఐనప్పటికీ ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైనది అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు , నేతలు ఉన్నప్పటికీ , అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిగా ద్రుష్టి సారించలేకపోతున్నారు అంటే నమ్మక తప్పదు. కానీ ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన టీడీపీ తెలంగాణలోనూ, పార్టీని బలోపేతం చెయ్యాలని సంకల్పించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే, తెలంగాణ లో కొన్ని బాధ్యతలని హరికృష్ణ కుమార్తె కి అప్పచెప్పినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని వారి నివాసము నందు మర్యాదపూర్వకంగా కలిసి, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు తదితర అంశాల గురించి చర్చించారు.