ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకి రక్షణ కల్పించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 15, 2022, 11:52 AM

రాష్ట్రంలో రోజు రోజుకి మహిళల పైన , చిన్న పిల్లలపైనా , అఘాయిత్యాలు, హత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి అని జనసేన నాయకులూ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకి రక్షణ కలిగించడంలో పూర్తిగా విఫలం చెందింది అని వాపోయారు. ఈ నేపథ్యంలో  గుంటూరు నగరంలోని కలెక్టరేట్ ఎదుట రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించలేని అసమర్ధ వైసీపీ పార్టీ  పాలనని నిరసిస్తూ జనసేన పార్టీ  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులూ, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలియచేసారు. ప్రభుత్వం ఇప్పటికైనా జరిగే అన్యాయాల మీద చర్యలు తీసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు కలిగించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com