నాటు సారా ను అరికట్టడానికి మీ వంతు సాయం ప్రభుత్వానికి, పోలీస్ వారికీ చెయ్యాలని బెల్లం వ్యాపారులను, గుంటూరు రేంజి డీఐజీ డా. శ్రీ CM త్రివిక్రమ వర్మ ఐపీఎస్ మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ కోరారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ.... బెల్లం వ్యాపారులు మరియు విక్రయదారులు మీ దగ్గర ఎక్కువ మొత్తంలో బెల్లం కొనే వారి వివరాలను మరియు కొత్తగా బెల్లం కొనే అనుమానిత వ్యక్తుల వివరాలను పోలీస్ వారికి ఎప్పటికప్పుడు తెలియపరచాలి అని ఆదేశించారు. అదే విధంగా బెల్లంతో పాటు నాటుసారా తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలైన నల్లబెల్లం,పటిక,అమ్మోనీయం వంటి పదార్ధాల విక్రయాలు చేయరాదని సూచించారు.
అదేవిధంగా ఎస్పీ మాట్లాడుతూ....ఈ నాటుసారా నిర్మూలనకు కేవలం స్థావరాలపై దాడులు నిర్వహిస్తే సరిపోదు,ముడి పదార్ధాల సరఫరా మరియు విక్రయాలను కూడా అరికట్టి,పూర్తిగా నాటుసారాపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో మీ అందరి తోడ్పాటు కోరుతున్నామని బెల్లం వ్యాపారులకు తెలిపారు. నిర్భయంగా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, అట్టివారి వివరాలను గోప్యంగా ఉంచుతామని శ్రీ ఎస్పీగారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీగారితో పాటు నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కరరావు గారు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.