ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు పిల్లల్ని తోసేసి రైలులో నుంచి దూకిన మహిళ

national |  Suryaa Desk  | Published : Sun, May 15, 2022, 06:01 PM

ఓ మహిళ రైలు ఆగదనే హడావిడిలో తనతో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసింది. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని రైల్వే స్టేషన్​లో శనివారం ఓ మహిళ తన ఇద్దరు పిల్లల్ని ప్లాట్​ఫాంపైకి తోసేసింది. వెంటనే ఆమె కూడా దూకింది. పిల్లలు రైలుకు కాస్త దూరంగా పడిపోయారు. ఆమె మాత్రం రైలు కింద పడబోయింది. అదృష్టంకొద్దీ అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్​ సమయస్ఫూర్తితో వారిని కాపాడారు. తాము ఎక్కిన రైలు సీహోర్​ లో ఆగదని తెలిసి ఆ మహిళ ఇలా చేసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa